మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలా? అమరావతి కావాలా?

16 Sep, 2022 06:20 IST|Sakshi

 మంత్రి ఆర్‌కే రోజా

సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలా? అమరావతి ఒక్కటే చాలా అని టీడీపీ వాళ్లు ప్రజల్లోకి వెళితే ఏం కావాలో వారే చెబుతారు. 29 గ్రామాల్లో టీడీపీ నేతలు, వారి బినామీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు 26 జిల్లాల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని వాళ్ల స్వార్థం కోసం వాడుకున్నారు.

మూడు రాజధానుల ప్రకటన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ప్రజలు మా పారీ్టకి ఎంతలా బ్రహ్మరథం పట్టారో మరిచిపోయారా? అసెంబ్లీకి రాలేని చంద్రబాబు, ప్రజల్లోకి వెళ్లలేని లోకేశ్‌ మాపై విమర్శలు చేస్తారా? లోకేశ్‌ ఓ పిల్లిబిత్తిరి. అలాంటివాడు సీఎంను ఏకవచనంలో మాట్లాడతాడా? వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ఒకే నోటిఫికేషన్‌తో 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు.

మరో 2.60 లక్షల మందిని వలంటీర్లుగా తీసుకుని ప్రజలకు సేవలందిస్తున్నారు. వైద్య రంగంలోనూ నియామకాలు చేపట్టారు. కొడాలి నాని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. ఆడవాళ్లను ఇళ్ల మీదకు పంపిస్తారా? ఎమ్మెల్యేల ఇళ్లపైకి వెళ్లి భయపెడతామంటే సహించం.  

మరిన్ని వార్తలు