బీఆర్‌ఎస్, బీజేపీలవి దొంగాటలు 

4 Mar, 2023 01:43 IST|Sakshi

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 

ఆలంపూర్‌: ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్, బీజేపీ దొంగాటలు అడుతున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో బీఎస్పీ బహుజన రాజ్యాధికార యాత్ర శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆలంపూర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.

అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్‌ను 27 నుంచి 50 శాతానికి ఎందుకు పెంచడం లేదని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి వస్తున్న అడ్డంకులేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్ల గురించి ఎమ్మెల్యేలెవరైనా మాట్లాడితే వారిని ప్రగతిభవన్‌లోకి అడుగు పెట్టనీయరని, అందుకే వారు క్యాంపు కార్యాలయాలకే పరిమితమయ్యారని అన్నా రు.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు మహిళారిజర్వేషన్లు గుర్తుకు వచ్చాయని, అందుకే నిరాహార దీక్ష చేస్తానని అంటున్నారని అన్నారు. తెలంగాణలో 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళామంత్రి లేరని, అప్పుడు ఎందుకు కవితకు నిరాహార దీక్ష ఆలోచన రాలేదని ప్రశ్నించారు. బీఎస్పీ కేవలం మహిళల గురించే కాదు బీసీలు, మైనారీ్ట, ఎస్టీల రిజర్వేషన్ల కోసం కూడా పోరాడుతుందన్నారు.

రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లింల కోసం ఒక శా తం కంటే తక్కువగా నిధులు కేటాయించడం శోచనీయమని అన్నారు. ముస్లింల పై సానుభూతి వ్యక్తం చేసే పారీ్టలు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మహిళా కనీ్వనర్‌ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు