ప్రగతిభవన్‌లో ఎంట్రీపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సంచలన కామెంట్స్‌

23 Nov, 2023 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అమరవీరుల త్యాగాలను కళ్లారా చూశాను. తెలంగాణలో బాన్చన్‌ కల్చర్‌ సజీవంగా ఉందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. నన్ను హిందూ వ్యతిరేకి అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. 

కాగా, ఆర్‌ఎస్పీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రగతి భవన్‌లోకి సీఎస్‌లకు ఎంట్రీ నిరాకరించిన సందర్భాలున్నాయి. అపాయిమెంట్‌ ఉంటేనే లోపలికి అనుమతించేవారు. చాలా మంది గంటలు గంటలు బయట వేచి చూడటం నాకు తెలుసు. ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని అధికారులను ఏనాడూ అడగలేదు. అధికారులు చెప్పినా కేసీఆర్‌ పట్టించుకోలేదు. తెలంగాణలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్చ బ్యూరోక్రాట్స్‌కు లేదు.

ఎంతమంది తెలంగాణ బిడ్డలకు కేటీఆర్‌ ఉద్యోగాలు ఇచ్చారు?. కుట్రలతో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మాయావతి ఏడు లక్షల ఎకరాల భూమిని పంచారు. బడుగు, బలహీన, వెనుకబడిన అనే పదాలను నిషేధించాలి. మేం బీఫాంలు ఎప్పుడూ అమ్ముకోలేదు. మేము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. అసత్యాన్ని అతికేలా చెప్పడే బీజేపీ సిద్ధాంతం. బీసీలకు అడుగడుగునా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. స్వేరోస్‌ అంటే ఆకాశమే హద్దుగా అని అర్థం. 

అంకితభావంతో పనిచేసే వాళ్లను ఎప్పుడూ పార్టీ వదులుకోదు. పేద పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే ఉండాలా?. బీఎస్పీ పార్టీకి డబుల్‌ డిజిట్‌లో సీట్లు వస్తాయి. పెద్ద కంపెనీల్లో ఒక్క పేదవాడైనా పెద్ద హోదాలో ఉన్నాడా?. ఈసారి 80 శాతం టికెట్లు మా పార్టీ వారికే ఇచ్చాం. ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం బోధన నిర్ణయాన్ని సమర్థిస్తాను. మాతృభాషతో పాటు ఇంగ్లీష్‌ బోధనను ప్రమోట్‌ చేయాలి. ఇంగ్లీష్‌ మీడియం తీసుకువచ్చి ఏపీ ప్రభుత్వం మంచి పనిచేసింది. జీవితంలో ఎదగాలంటే ప్రతీ ఒక్కరికీ చదువు అవసరం. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు