‘గడప గడపకు’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన.. టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికెళ్లిన వెల్లంపల్లి

28 Oct, 2022 11:14 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాధరపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌.. గడప గడపకి కార్యక్రమంలో భాగంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య జయప్రదకు రైతు భరోసా కింద 13,500 రూపాయలు అందినట్లుగా ధ్రువీకరణ ప్రతాన్ని అందజేశారు.
చదవండి: ‘సైకిల్‌’ కకావికలం.. కుప్పంలో పడిపోయిన టీడీపీ గ్రాఫ్‌ 

ఇంటిలోనే ఉన్నప్పటికీ వర్ల రామయ్య, ఆయన భార్య జయప్రద బయటకురాలేదు. ధ్రువీకరణ పత్రం తీసుకోవడానికి డ్రైవర్‌ను పంపించారు. రైతు భరోసా అందినట్లుగా డ్రైవర్‌ ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత  వర్ల రామయ్య ఇంట్లో కూడా రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. టీడీపీ నేత కూడా ప్రభుత్వ పథకం అందుకున్నారన్నారు. అర్హత ఉంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మ ఒడి ఇస్తామని వెల్లంపల్లి అన్నారు.

మరిన్ని వార్తలు