సాగర్‌ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా

6 Apr, 2021 15:48 IST|Sakshi

సాక్షి, నల్గొండ: సాగర్‌ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ రంగనాథ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగర్‌ నియోజకవర్గానికి వెళ్లే అన్ని రూట్లలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉప ఎన్నికకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

అంతర్‌రాష్ట్ర సరిహద్దు మాచర్ల వద్ద అదనపు భద్రత పెంచామని ఎన్నికల అధికారుల సూచన మేరకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా రెండోదశ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ప్రచారంలో నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా ప్రచారంలో పాల్గొన్నా.. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

( చదవండి: ఎన్నికల సిత్రాలు చూడరో: నిన్న ఏడుపులు.. నేడు చిందులు )

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు