‘కక్షసాధింపు పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారు’

16 Sep, 2020 14:40 IST|Sakshi

‘మీడియా నోరు నొక్కేయడం ఓవర్ రియాక్షన్‌గా ఉంది’

సాక్షి, అమరావతి : ప్రతిపక్షం మీడియా స్వేచ్ఛను హరించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మీడియాలో కథనాలు ప్రసారం చేయకూడదని కోర్టుకు వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో అధికార పార్టీ మీడియా స్వేచ్ఛను హరించిందని విన్నాం, కానీ ఇప్పుడు ప్రతిపక్షమే మీడియాలో కథనాలు రాకూడదంటూ కోర్టుకెళ్లిందని అన్నారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని తెలిపిన సజ్జల ప్రాథమిక సాక్ష్యాధారాలతోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వెల్లడించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణలో తొందరపాటు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. చదవండి: (అమరావతి భూ కుంభకోణంపై దర్యాప్తు ఆపండి )

సిట్‌ అనేది స్వతంత్ర విచారణ సంస్థ అని, నిన్న జరిగిన పరిణామాలు కొత్త పోకడగా అనిపిస్తున్నాయని మండిపడ్డారు. తప్పులపై విచారణ జరగకుండా కక్షసాధింపు పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారుని విమర్శించారు. మేధావులు కూడా నిన్నటి పరిణామాలపై విస్మయం చెందుతున్నారని తెలిపారు. టీడీపీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి అడ్వకేట్ జనరల్‌గా అవకాశం ఇచ్చారన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకుంటున్నారని, ఢిల్లీ నుంచి న్యాయవాదులను తెచ్చుకోవడానికి అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా వేసిన మరో పిటిషన్‌పై కూడా స్టే వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతుందని భావిస్తే సీబీఐ దర్యాప్తు కోరవచ్చు కదా అని ప్రశ్నించారు.
చదవండి: (లోకేష్‌కు ఆ విషయం కూడా తెలియదా?: సజ్జల)

సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రభుత్వం కోరితే ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టులో ఎప్పుడు ఏ కేసు వస్తుందో టీడీపీ నేతలకు ఎలా తెలుసని, ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ గురించి బోండా ఉమ నిన్ననే ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండగా అమరావతి పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని, ఎన్నికలకు ముందే తాము అధికారంలోకి వస్తే దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, అమరావతిలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అలాగే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది)

మీడియా స్వేచ్ఛను పరిరక్షించడానికి కోర్టులు పాటుపడేవి.. కానీ నిన్న రాత్రి అది వ్యతిరేకమయ్యిందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ‘సామాన్యులకు అండగా కోర్టులు నిలబడేవి.ఇప్పడు పెద్దలకు ఒక తీర్పు, సామాన్యులకు ఒక తీర్పు అనేలా పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థ నిష్పక్షికత ప్రశ్నార్ధకం అవుతోంది. రాజీవ్ ర్దేశాయ్ వంటి ప్రముఖ జర్నలిస్టులు కూడా దీనిపై స్పందించారు. తప్పు జరిగిందా లేదా అనే అంశాన్ని కక్ష సాధింపుగా మార్చడం దొంగలకు అవకాశం ఇచినట్లే. దొంగతనం ఆధారాలతో చూపినా కక్ష ఉంది కాబట్టి నీ పిర్యాదు చెల్లదు అంటే ఎలా. మేము సీబీఐ విచారణ కోరాం. అది కూడా వద్దంటారా. ఒక అడ్వకేట్.. అంతకు ముందు ఒక పార్టీ కార్యకర్త. అతనిపై ఆధారాలు ఉన్నాయని కేసు నమోదు చేశారు. మీడియా నోరు నొక్కేయడం కొంచెం ఓవర్ రియాక్షన్‌గా అనిపిస్తోంది. దీనిపై మా నాయకుడు మొదటి నుంచి అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎప్పుడో చెప్పారు. దర్యాప్తు చేస్తామని ఎన్నికలకు ముందే చెప్పారు...దానిపైనే ప్రజలు 151 సీట్లతో తీర్పు ఇచ్చారు. అని పేర్కొన్నారు. చదవండి: (సభ్యసమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు)

మరిన్ని వార్తలు