చంద్రబాబు మాట.. అబద్ధాల మూట

4 Mar, 2021 05:11 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల ధ్వజం

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పన్నులు పిండేసి బూటకపు హామీలు

మరోసారి మా సత్తా చాటుతాం

సాక్షి, అమరావతి: అధికారంలో ఉండగా పన్నులతో ప్రజల రక్తాన్ని పిండుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను తగ్గిస్తామంటూ మోసపూరిత హామీలతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టే పంచాయతీ ఎన్నికల్లో కుప్పంతో సహా రాష్ట్రమంతా ఘోరంగా ఓడించారని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో  వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమ న్నారు. ఈ సందర్భంగా సజ్జల ఇంకా ఏమన్నారంటే... 

ప్రజలు అంతా గమనిస్తున్నారు..
పురపోరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఏకగ్రీవాలు పెరి గాయి. ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌ పనితీరును గమనిస్తున్నారు. కోవిడ్‌ కాలంలో భరోసా ఇవ్వడం, మెరుగైన చికిత్స అందించడంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రపంచంతోనే పోటీపడిందన్నది వాస్తవం. ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని తెలిసి చంద్రబాబు, ఎస్‌ఈసీ కలిసి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. ఎస్‌ఈసీని వీరుడు, ధీరుడు అని పొగిడినవారే ఆయన నీరుగారిపోయా డని, మారిపోయాడని విమర్శించడంలో అర్థమేం టి? ఎస్‌ఈసీ నాటకాలు కూడా అదేస్థాయిలో ఉన్నా యి. వలంటీర్లపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్‌ఈసీ చెప్పడం దారుణం. ఈ వ్యవహారంపై న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నాం. 

పురపోరులో టీడీపీకి అభ్యర్థులే కరువు..
40 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే టీడీపీకి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు కనీసం అభ్య ర్థులే లేకపోవడం సిగ్గుచేటు. టీడీపీ, చంద్రబాబుపై క్యాడర్‌ నమ్మకం కోల్పోయి పక్కకు తప్పుకుంటు న్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఏస్థాయిలో వేధించారో తెలిసిందే. అయినా ఏ ఒక్క కార్యకర్తగానీ, వైఎస్‌ కుటుంబీకులుగానీ వెనక్కు తగ్గారా? ఏ ఒక్కరైనా ఎన్నికల నుంచి తప్పుకున్నారా? టీడీపీ పాలనలో ఆస్తిపన్నులో వివిధ వర్గాల మధ్య తేడాలుండేవి. వైఎస్‌ జగన్‌ దీన్ని సరిదిద్ది పారదర్శకంగా ఉండేలా చట్ట సవరణ చేశారు. 15 శాతం మించని పన్ను తీసుకొచ్చారు. దీనిప్రకారం మహా అయితే రూ.150 కోట్ల అదనపు పన్ను వస్తుందేమో. ప్రజలపై పన్నుల భారం వేస్తున్నట్లు చంద్రబాబు యాగీ చేస్తున్నారు. మొన్న పంచాయతీ సీఎంగా... ఇప్పుడు మున్సిపల్‌ సీఎంగా మారిపోయిన చంద్ర బాబు ప్రకటించిన తప్పుడు మేనిఫెస్టోపై ఎస్‌ఈసీ కి ఫిర్యాదు చేస్తాం. 2014లో చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. చంద్రబా బు మాట అబద్ధాల మూట లాంటిది. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపర్చాలన్న తలంపుతో ఉన్నారు. దొడ్డిదారిన పన్నులేయాలనే ఆలోచన ఆయన కలలో కూడా చేయరు. కాబట్టే జనం పంచాయతీ ఎన్నికల్లో అంతగా ఆదరించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇంతకన్నా మెరుగైన తీర్పు వస్తుంది.  

మరిన్ని వార్తలు