ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీడీపీ అడ్డదారులు

18 May, 2021 18:36 IST|Sakshi

సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామకృష్ణరాజు పాల్పడ్డారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారని మండిపడ్డారు. రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. రఘురామను అడ్డంపెట్టుకుని ప్రభుత్వంపై చంద్రబాబు కుట్ర చేయాలనుకున్నారని ధ్వజమెత్తారు.

‘రఘురామకృష్ణరాజుపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేసింది. ఆయన అరెస్టుపై టీడీపీ అనవసర యాగీ చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలోనే రఘురామకు వైద్య పరీక్షలు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని’’ సజ్జల దుయ్యబట్టారు.

పార్టీ నచ్చకపోతే రఘురామకృష్ణరాజు ఎందుకు రాజీనామా చేయలేదని సజ్జల ప్రశ్నించారు. ‘నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బాబు రాజద్రోహం కేసులు పెట్టారు. గుంటూరులో న్యాయవాదులపైనా రాజద్రోహం కేసులు పెట్టారు. ఇప్పుడేమో రాజద్రోహం కేసు ఉందా అని బాబు మాట్లాడుతున్నారని’’ సజ్జల దుయ్యబట్టారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం ఉందని.. కుట్రలో భాగంగానే ఎల్లో మీడియాలో రఘురామకృష్ణరాజుకు ప్రచారం చేశారన్నారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందనేదే చంద్రబాబు భయమని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సమావేశాలు నిర్వహించలేదా?. విచారణ జరుగుతుండగానే ఎల్లో మీడియా ఎందుకు భయపడుతోంది’’ అంటూ సజ్జల ప్రశ్నించారు. ప్రభుత్వం ఎక్కడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగానే పౌర హక్కులకు భంగం కలిగిందన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి కేసును చంద్రబాబే పంచాయతీ చేశారని, రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చావుకు బాబు కారణమయ్యారన్నారు. అరాచక, ఆటవిక పాలన అంటే చంద్రబాబు హయాంలో జరిగిందేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

చదవండి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు 
మీ రాజకీయం మరణ శాసనం.. టీడీపీకి గుడ్‌బై

మరిన్ని వార్తలు