కులమతాలకు అతీతంగా పాలన

9 Aug, 2021 02:41 IST|Sakshi

చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు 

ఆర్యవైశ్యులను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ 

ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులందరికీ అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యవహారాలు, పార్టీ వ్యవహారాలు, నాయకుల ట్రీట్‌మెంట్లో గానీ ఎక్కడా కుల, మత ప్రభావాలు కనిపించవని స్పష్టం చేశారు. అలాంటప్పుడు పనిగట్టుకుని చేస్తున్న బీజేపీ దుష్ప్రచారాన్ని అందరూ కలసికట్టుగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్య అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ అధ్యక్షతన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సజ్జల మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం ఉన్న సమయంలో విజయవాడలో చంద్రబాబు పలు ఆలయాలను కూలగొట్టారని గుర్తు చేశారు. ఆనాడు బీజేపీ వారు కిమ్మనలేదని విమర్శించారు. కేంద్రం లక్షల కోట్ల అప్పులు తెచ్చిందన్నారు. అలాంటిది సీఎం జగన్‌ ప్రభుత్వం ఏదో అప్పులు చేసేస్తోందని బీజేపీ, టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఆర్యవైశ్యులలో పేదలను ఆదుకునేందుకు ప్రత్యేకనిధిని కార్పొరేషన్‌ ద్వారా ఏర్పాటు చేసుకుంటే దానికి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ప్రభుత్వం నుంచి మరికొంత ఇచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆర్యవైశ్యులను సీఎం జగన్‌ రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారన్నారు.

పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం కండి.. 
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం సీఎం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఆర్యవైశ్యులు భాగస్వామ్యం కావాలని కోరారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, అన్నా రాంబాబు, ఆర్యవైశ్య సంఘం నేతలు పాల్గొన్నారు.  

ఉద్యోగుల హక్కుల సాధనకు సాయం
ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల సాధనలో ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని, ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగమని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అధ్యక్షతన ఆదివారం విజయవాడలో ఏపీఏఎస్‌ స్థాపన కోసం డైరెక్ట్‌ రిక్రూటెడ్‌ గ్రూపు–1 అధికారులతో మేధో మథన సదస్సు జరిగింది. 

మరిన్ని వార్తలు