దుష్టరాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు

19 Sep, 2020 05:35 IST|Sakshi

అందుకే ప్రతిపక్షాలను వారు పట్టించుకోవడంలేదు  

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

సాక్షి, తాడేపల్లి: రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు ఏకమై దేవాలయాలపై దాడులు చేయిస్తున్నట్లుగా అనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు.  ప్రతిపక్షాలు చేసే ఈ దుష్ట రాజకీయాలను ప్రజలు అర్ధంచేసుకున్నారని.. అందుకే వారు వీటిని పెద్దగా పట్టించుకోవడంలేదని ఆయనన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. 

► రోజు దేవాలయాల్లో ఏదో ఒకటి ఎందుకు జరుగుతుంది?  
► అంతర్వేది ఘటన విషయంలో దేశంలో ఏ ప్రభుత్వం స్పందించని విధంగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. అధికారులపై చర్యలు తీసుకుంది, విచారణ జరుపుతోంది. కొత్త రథం నిర్మాణానికి ఆదేశించింది.  ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.  
► సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలుచేసే పథకాలను చూసి ఓర్వలేక వాటిపై ప్రజల్లో జరిగే చర్చను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. 
► గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని వేణుగోపాలస్వామి రథం తగలబడింది. కానీ, అప్పట్లో ఆ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు.  
► ప్రజలే చందాలు వేసుకుని రథాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు తెలిసింది.
► రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసి ప్రజల కోసం నిలబడి ఓట్లు తెచ్చుకోవాలి. 
► కానీ, అడ్డదారుల్లో ఓట్లు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రతిపక్షాల్లో కనిపిస్తోంది.   

>
మరిన్ని వార్తలు