'చంద్రబాబు.. నిమ్మగడ్డల డీఎన్‌ఏ ఒక్కటే'

27 Jan, 2021 18:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్‌ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన​ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఎస్‌ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది.చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల విధులను నిమ్మగడ్డ దుర్వినియోగం చేస్తున్నారు.  సీనియర్ అధికారుల పట్ల ఎస్‌ఈసీ వాడిన భాష సరికాదు. తన పరిధిలో లేని అంశాలను ప్రస్తావిస్తూ నిమ్మగడ్డ లేఖ రాశారు.అధికార యంత్రాంగాన్ని అస్థిరపరచాలని ఎస్‌ఈసీ చూస్తున్నారు. చంద్రబాబు, నిమ్మగడ్డ డీఎన్‌ఏ ఒక్కటే. నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉండటం రాష్ట్రం ఖర్మ. దేశవ్యాప్తంగా జనవరి 16న సీఈసీ ఓటర్ల జాబితా విడుదల చేసింది..గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటే కనీసం 2 నెలలు పడుతుంది. 2 నెలల తర్వాత కానీ ఎన్నికలు జరపలేమని నిమ్మగడ్డకు కూడా తెలుసు.. అందుకే అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు.
చదవండి: పంచాయతీ ఎన్నికలు: రాజుకుంటున్న వేడి!

అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డర్స్‌ను అమలు చేయలేం..
ఉద్యోగులు, అధికారుల్లో నిమ్మగడ్డ టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరుగుతాయి. ఎన్నికల్లో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను నిమ్మగడ్డ అమలు చేస్తున్నారు. ఎస్‌ఈసీ కేవలం సిఫారసు మాత్రమే చేయగలరు... అడ్డగోలుగా ఇచ్చిన ఆర్డర్స్‌ను ప్రభుత్వం అమలు చేయదు. అధికారులెవరు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి. అధికారుల విషయంలో నిమ్మగడ్డ చేసిన దాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మా అధికారులను రక్షించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహా అయితే ఈ కొద్దీ రోజులు డ్యూటీ నుంచి పక్కన పెట్టొచ్చు. ఆ రోజు ఇదే చంద్రబాబు.. ఇదే ద్వివేదిని ఛాంబర్ లోకి వెళ్లి ఈసీ అంటే పెద్దాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మరో రకంగా వ్యవహరిస్తున్నారు.
చదవండి: ఎన్నికలకు ఏమాత్రం భయపడం: సజ్జల

ఏకగ్రీవాలు కొత్తగా జరుగుతున్నాయా?
ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సింది పోయి...ఒక్క ఓటు ఉన్నా నామినేషన్ వేయాలి అని చంద్రబాబు అనడం దేనికి సంకేతం? పార్టీ రహితంగా ఉన్న ఎన్నికల్లో ఆయన ఎందుకు అంత ఘీంకరించడం? ఏకగ్రీవాలు కొత్తగా జరుగుతున్నాయా? గతంలో కూడా జరిగాయి కదా.. ఎప్పుడైతే నిమ్మగడ్డ పక్షపాతంగా వ్యవహరిస్తున్నపుడే ఆయనపై గౌరవం పోయింది. ఎప్పుడు ఈ పీడ వదులుతుందో తెలియదు కానీ... అద్దంలో ముఖం చూసుకుంటే దెయ్యం కనపడుతుంది. 20 రోజుల తర్వాత ఆ పార్టీ సమాధి కావడం ఖాయం. ఈలోగా ఉద్యోగులు, అధికారుల్లో అభద్రత పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ వెంట ప్రభుత్వం ఉంది..ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు పంపనున్నాం.. అధికారులను క్రిమినల్ పరువు నష్టం వేయాల్సిందిగా సూచిస్తున్నామంటూ' తెలిపారు.

మరిన్ని వార్తలు