Evening Top 10 Telugu News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

23 Aug, 2022 17:07 IST|Sakshi

1. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్‌.. పది రోజుల్లోగా..
మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. నుపూర్‌ శర్మ​ ఎపిసోడ్‌తో రాజాసింగ్‌పై తక్షణం చర్యలు చేపట్టింది పార్టీ హైకమాండ్‌. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష.. కీలక ఆదేశాలు
స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. విద్య, వైద్యంలో నాడు-నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి
రాజకీయాలలో నోరు జారితే ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారుతుంది. అందులోను ముఖ్యమైన స్థానాలలో ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి పలు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే నేతలు పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంటారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పాఠశాల విద్యాశాఖ 502 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్‌ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్‌ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే‌.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే!
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్ లోథ్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. అవసరమైతే ధర్మం కోసం తాను చనిపోయేందుకైనా సిద్ధం కానీ... వెనక్కి తగ్గనని ఆయన తేల్చిచెప్పారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. శివసేన గుర్తు ఎవరికి? 8 ప్రశ్నలు రూపొందించిన సుప్రీంకోర్టు
శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. డెబిట్‌, క్రెడిట్‌ కార్డు నిబంధనలు: చివరి తేదీ వచ్చేస్తోంది
ఆన్‌లైన్‌ షాపింగ్‌ సౌలభ్యం కోసం ఆర్బీఐ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. అలాగే  చాలా సురకక్షితంగా  కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి!
ఈ మధ్య విరాట్‌ కోహ్లితో నేను మాట్లాడలేదు. అయితే, గొప్పవాళ్లుగా పేరొందిన ఆటగాళ్లు సరైన సమయంలో కచ్చితంగా తామేంటో నిరూపించుకుంటారు. కోహ్లి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆసియా కప్‌ రూపంలో మంచి అవకాశం వచ్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్‌ ఫొటో
మెగాస్టార్ చిరంజీవి నిన్నటితో (ఆగస్ట్ 22న) 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో చిరు బర్త్ డే సెలబ్రెషన్స్ ఘనంగా జరిగాయి. ఇక అభిమానులు, సెలబ్రెటిల నుంచి ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన సురేష్‌ హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు