Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

4 Aug, 2022 09:56 IST|Sakshi

1. రామోజీ ‘మేనేజ్‌మెంట్‌’కు ఇదో ఉదాహరణ 
‘అక్రమంగా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేసిన మార్గదర్శి కేసులో రామోజీరావు రూ.6,000 కోట్లు జరిమానాగా కట్టాలి. రామోజీరావు వసూలు చేసిన డబ్బు కట్టేసి కేసు నుంచి బయటపడ్డారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కేసీఆర్‌కు కీలకంగా మారిన మునుగోడు.. ఐ ప్యాక్‌ నివేదికలో ఏముంది!
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్‌ టవర్స్‌ ప్రత్యేకలివే..
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయంగా కన్పిస్తున్న నేపథ్యంలో అక్కడ గులాబీ జెండా ఎగిరేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది. సుమారు పక్షం రోజుల క్రితమే ఉప ఎన్నికపై స్పష్టంగా ఉప్పందడంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలి
ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి కోరారు. సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. ఆయన రాయకపోతే తానే లేఖ రాస్తానన్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘పునరావాస కేంద్రం నుంచి అధికారులు గెంటేయలేదు’.. వాస్తవానికి భిన్నంగా ‘ఈనాడు’ కథనం
ప్రభుత్వంపై బురద చల్లేందుకు పత్రికా ప్రమాణాలకు తిలోదకాలిస్తూ ఈనాడు పత్రిక మరోసారి దిగజారుడు రాతలకు దిగింది. వాస్తవాలను దాచిపెట్టి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మంగళవారం ‘చంద్రబాబుకు బాధలు చెబితే పునరావాస కేంద్రం నుంచి గెంటేస్తారా?’ అంటూ ఏలూరు జిల్లాలోని గోదావరి ముంపు గ్రామమైన వేలేరుపాడు గ్రామానికి చెందిన ఎర్రా వనజాకుమారి చెప్పినట్టు ఓ కథనాన్ని వండి వార్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. చైనా, తైవాన్‌ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్‌ కంట్రీ కన్నెర్ర
చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ (82) తైవాన్‌ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ‘మహా’దారిలో జార్ఖండ్‌ ? కాంగ్రెస్‌ భయానికి కారణాలివీ...
జార్ఖండ్‌ మరో మహారాష్ట్ర కానుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. మహారాష్ట్రలో 40 మంది పై చిలుకు ఎమ్మెల్యేలతో ముంబై నుంచి బిచాణా ఎత్తేసి వేరుకుంపటి పెట్టుకున్న శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండేతో బీజేపీ రసవత్తర రాజకీయ నాటకం ఆడించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి!
కరోనా అనంతరం మారిన పరిస్థితుల్లో.. మహిళలు ఇంటి నుంచి పనిచేసేందుకే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అవకాశం కల్పించే కంపెనీల వైపు చూస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు
కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ రికార్డు సృష్టించాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. టాలీవుడ్‌ అసలు శత్రువు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యూట్యూబ్‌ చానళ్లు
ప్రస్తుతం టాలీవుడ్‌లో షూటింగ్‌ సంక్షోభం నెలకొంది. ‘యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌’, ‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి’ నిర్ణయాల మేరకు తెలుగు పరిశ్రమలో షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ షూటింగ్స్‌పై పలువురు సినీ ప్రముఖులు రకరకాలుగా స్పందిస్తు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు