Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

5 Aug, 2022 09:54 IST|Sakshi

1. మంకీపాక్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్‌ సర్కార్‌
ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. 'టార్గెట్‌ 175' కుప్పం నుంచే తొలి అడుగు
రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేసే వాతావరణం కుప్పం నుంచే ప్రారంభం కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ కార్యకర్తలకు ఉద్బోధించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. చైనా ఎంత పని చేసింది.. ప్రపంచ దేశాలకు పెను సవాల్‌!
కోవిడ్‌ ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రభావం ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. పులి మీద పుట్రలా తైవాన్‌ చుట్టూ చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు, క్షిపణి దాడులు ఆందోళన పెంచుతున్నాయి. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్.. పరామర్శించిన అఖిలేశ్‌ యాదవ్‌
ఎస్పీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్‌ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. నగరవాసులకు అలర్ట్‌
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జనజీవనం స్తంభించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్‌.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా!
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి, పీడీ యాక్టు కింద జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. భారతీయులకు గుడ్‌న్యూస్‌.. డేటా రక్షణకు కొత్త బిల్లు
వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్‌సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్‌ దీనిపై మాట్లాడారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. టీమిండియా వైస్‌ కెప్టెన్‌ వచ్చేస్తున్నాడు.. మరి కోహ్లి సంగతి!
ఆసియా కప్‌ 2022కు సంబంధించి టీమిండియా జట్టును ఆగస్టు 8(సోమవారం) ప్రకటించనున్నారు. ఉపఖండంలో జరిగే ఈ మెగాటోర్నీని టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు ఇది సన్నాహకంగా మారుతుందని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ‘బింబిసార’ ట్విటర్‌ రివ్యూ
నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్ర‌మ్ ఈవిల్ టు గుడ్ క్యాప్ష‌న్.  కళ్యాణ్ రామ్ ఆయన కేరీర్ లోనే బిగ్ బడ్జెట్‌ మూవీ ఇది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట్‌ దర్శకత్వం వహించాడు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. మునుగోడులో కాల్పుల కలకలం! కారణాలివేనా?
వాటర్‌ బాటిల్స్‌ సరఫరా చేసే డీలర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసి వెంటనే పరారయ్యాడు. మూడు చోట్ల బుల్లెట్‌ గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు