యూపీఏ చైర్మన్‌గా పవార్‌ మాకు ఓకే : సంజయ్‌రౌత్‌

12 Dec, 2020 07:35 IST|Sakshi

సాక్షి, ముంబై: యూపీఏ కూటమి చైర్‌పర్సన్‌ అభ్యర్ధి మార్పుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నిమమించబడితే సంతోషంగా ఆహ్వనిస్తామని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిల్లో కాంగ్రెస్‌ ప్రతిపక్షాలతో జతకట్టడమే చాలా ఉత్తమైన మార్గమని అన్నారు. పవార్‌ యూపీఏ చైర్‌ పర్సన్‌ బరిలో ఉంటే తాము పూర్తి మద్దతిస్తామని తెలిపారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఎన్నడు లేనంతంగా సంక్షోభంలో ఉందని, యూపీఏ కూటమి బలపడాలంటే దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని రౌత్‌ పేర్కొన్నారు.

కాగా, సంజయ్‌ రౌత్ వ్యాఖ్యలకు శివసేన అధికార ప్రతినిధి మహేష్‌ స్పందిస్తూ.. శరద్‌ పవార్‌ యూపీఏ నాయకత్వం వహిస్తారన్న వార్తలు నిరాధారమైనవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలను దారి మళ్లించడానికి స్వార్ధ ప్రయోజనాల కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక శివసేన పార్టీ శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ భాగస్వామ్యంతో మహరాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు