క్లారిటీగా చెప్పిన.. ఆపకపోతే నా అనుచరులకి అప్పగిస్తా: జగ్గారెడ్డి ఫైర్‌

21 Aug, 2023 21:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చా. మీడియా సమావేశం పెట్టినా.. ఇంకా పుకార్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ గుసగుసలు ఇప్పటికైనా బంద్‌ కావాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీలోనే నేతలు చేస్తున్న ప్రచారంపై ఫైర్‌ అయ్యారు. తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న పుకార్లపై మండిపడ్డ ఆయన..  ‘‘మళ్లీ చెప్తున్నా.. పార్టీ మారే ఉద్దేశం లేదు. నా గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తే.. పార్టీలో ఫిర్యాదు చేస్తా.  పరువునష్టం దావా వేస్తా. లీగల్‌ నోటీసు ఇస్తా. అయినా మారకపోతే నా అనుచరులకి అప్పగిస్తా’’ అంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు జగ్గారెడ్డి.  

‘‘మీడియా సమావేశంలో నేను చెప్పినప్పటికి కొంతమంది గుసగుసలు పెడుతున్నారు. అనుమానం క్లియర్ చేశాను.. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా?. అనుమానించే వారికీ పనేం లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కస్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది గుసగుసలు ఇప్పటికైనా బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏం సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి పిర్యాదు చేస్తా. రేవంత్, భట్టి లతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించి.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా.

పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పరువు నష్టం దావా వేస్తా. ఇప్పటికీ నాకు స్వంత ఇల్లు లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి.. అది వారికే ఇచ్చేస్తా. ధరణి లో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే.. వారికే ఇస్తా.  90 శాతం అహింస వాదిని.. 10 శాతం భగత్ సింగ్ లాగా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని అంటూ వ్యాఖ్యలు చేశారాయన. 

ఇదీ చదవండి:  కేసీఆర్‌ దృష్టిలో కమ్యూనిస్ట్‌ పార్టీ కరివేపాకు!

మరిన్ని వార్తలు