Bharat Jodo Yatra: కాంగ్రెస్ బ్యానర్‌లో సావర్కర్ ఫోటో.. ఇప్పుడైనా తేరుకుందంటూ బీజేపీ సెటైర్లు

21 Sep, 2022 20:03 IST|Sakshi

తిరువనంతపురం: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ బ్లండర్ మిస్టేక్ చేసింది. పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్‌లో స్వాతంత్ర్య సమరయోధులతో పాటు  వీర్ సావర్కర్‌ ఫోటో ఉంది. ప్రస్తుతం యాత్ర 14వ రోజుకు చేరుకుని కేరళలో కొనసాగుతోంది. ఎల్‌డీఎఫ్‌ మద్దతుతో గెలిచిన స్వతంత్ర్య్ ఎ‍మ్మెల్యే పీవీ అన్వర్ కాంగ్రెస్ బ్యానర్‌లో సావర్కర్ ఫోటోను గుర్తించి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్‍గా మారింది.

అయితే ప్రింట్ మిస్టేక్ వల్లే బ్యానర్‌లో పొరపాటుగా సావర్కర్ ఫోటో పడిందని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. సావర్కర్ ఫోటోపై గాంధీ ఫోటోను అంటింటి తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. వీర్ సావర్కర్‌ను కాంగ్రెస్ ఏనాడూ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించలేదు. ఆయన బ్రిటీష్ వాళ్లకు క్షమాపణలు చెప్పిన బలహీనమైన వ్యక్తి అని విమర్శలు చేసింది. అలాంటిది ఆయన ఫోటో ఇప్పుడు కాంగ్రెస్‌ బ్యానర్‌లో కన్పించడం రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయింది.

దీన్నే అదనుగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్‌పై సెటైర్లు వేసింది. హస్తం పార్టీ ఇప్పుడైనా నిజం తెలుసుకుని వీర్ సావర్కర్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించిందని పేర్కొంది. రాహుల్ గాంధీ ఇప్పుడైనా తేరుకోవడం శుభపరిణామం అని పంచులు వేసింది.
చదవండి: ఇద్దరు కాదు ముగ్గురు.. కాంగ్రెస్ అధ్యక్ష ఎ‍న్నికల్లో తెరపైకి కొత్త పేరు

మరిన్ని వార్తలు