ఉద్రిక్తంగా మారిన బీసీల మహాధర్నా

11 Aug, 2022 01:22 IST|Sakshi
ర్యాలీగా వెళ్తున్న కృష్ణయ్య తదితరులు 

పార్లమెంట్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ బీసీల మహాధర్నాతో రెండోరోజు ఉద్రిక్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, లాల్‌ కృష్ణల నేతృత్వంలో చేపట్టిన చలో పార్లమెంట్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో బీసీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర స్థాయిలో 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, అందులో బీసీ ఉద్యోగులు 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. ప్రదర్శనలో కోల జనార్ధన్, కర్రి వేణు మాధవ్, కృష్ణ యాదవ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు