కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, వాజ్‌పేయి బంధువు కరోనాతో మృతి

27 Apr, 2021 09:58 IST|Sakshi

మాజీ ఎంపీ కరుణ శుక్లా కన్నుమూత 

అటల్‌ విహారీ వాజ్‌పేయి మేనకోడలు  కరుణ

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కరుణ శుక్లా (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన ఆమె చత్తీస్‌గఢ్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస తీసుకున్నారు. ఆమె మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కూడా. దీనిపై పలువురు నేతలు సంతాపాన్ని ప్రకటించారు.

కరుణ శుక్లా లోక్‌సభకు చత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ నియోజకవర్గంనుంచి  14వ లోక్‌సభకు  ప్రాతినిధ్యం వహించారు. 2014లో బీజేపీకి రాజీనామా చేశారు.  ఆతరువాత కాంగ్రెస్‌ పార్టీ  నుంచి 2014, 2018 ఎన్నికల్లో  పోలీచేసి ఓటమి పాలయ్యారు. కాగా కరోనా సెకండ్‌వేవ్‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. రోజుకు మూడున్నర లక్షలకుపైగా కేసులు, 2వేలకు పైగా మరణాలతో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం నాటి గణాంకాల ప్రకారం వరుసగా ఆరో రోజుకూడా మూడుల లక్షల మార్క్‌ను దాటి 3 23,144 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు మే 1 వ తేదీనుంచి 18 సంవత్పరాలు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు