కాంగ్రెస్‌లో చేరిన డి.శ్రీనివాస్‌

26 Mar, 2023 15:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్ పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. డీఎస్‌ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావ్‌ ఠాక్రే పార్టీలోకి ఆహ్వానించారు.

అయితే, గత కొంతకాలంగా సంజయ్ చేరికపై సందిగ్ధత నెలకొంది. డీఎస్‌ తనయుడి చేరికను జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం వ్యతిరేకించింది. అయితే, తండ్రి చొరవతో సంజయ్ చేరికకు మార్గం సుగమమైంది. గతంలో డీఎస్‌తో పాటుగా సంజయ్‌ టిఆర్ఎస్‌ (బీఆర్‌ఎస్‌)లో చేరారు. గత కొద్దికాలంగా బీఆర్‌ఎస్‌కు సంజయ్‌ దూరంగా ఉంటున్నారు. 

డీఎస్‌ చేరికపై ట్విస్టు
కాగా, డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్‌ పేరుతో ఓ లేఖ విడులైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్‌ స్వయంగా ప్రకటించారు. వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్‌.. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


డీఎస్‌ పేరుతో ప్రచారంలోకి వచ్చిన పత్రికా ప్రకటన

‘‘కాంగ్రెస్‌లో చేరుతున్నా కాబట్టే గాంధీభవన్‌కు వచ్చా. రాహుల్‌కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్‌ చేరుతున్నా. నేను కాంగ్రెస్‌ వ్యక్తిని.. నన్ను ఎవరూ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్‌పై అనర్హత  వేటువేసే వారికి అసలు అర్హత ఉందా?. రాహుల్‌ ఊహించని దానికంటే గొప్పగా పనిచేస్తున్నారు’’ అని డీఎస్‌ అన్నారు.

మరిన్ని వార్తలు