ఇంటర్‌నెట్‌ ఫ్రీ అన్నారు ఏమైంది?

23 Nov, 2020 16:40 IST|Sakshi

కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ మోసగాళ్లే

అబద్దాల్లో తండ్రికొడుకులు ఫస్ట్‌

కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లకు అబద్దాలు చెప్పడంలో గిన్నిస్‌ బుక్‌లో మొదటి స్థానంలో ఇవ్వచ్చని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. గాంధీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 2016 ఎన్నికల్లో 100 రోజుల ప్రణాళిక అన్నారు.. లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు అన్నారు.. ఇప్పుడు ఏమైంది? ఇంటర్‌నెట్‌ ఫ్రీ అన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే ఎంబీసీలకు కార్పొరేషన్‌ ఎక్కడా.. మాటంటే మాటే అన్న సీఎం కేసీఆర్‌ ఏం మాటయ్య నీది అని మండిపడ్డారు. యువకులకు నిరుద్యోగ భృతి ఎక్కడా? అని ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. ఇక గ్రేటర్‌ ఎన్నికలకు అవి ఇస్తా, ఇవి ఇస్తా అని కేసీఆర్‌ వాగ్దానాలు ఇస్తున్నారని, గతంలో ఇచ్చిన వాగ్దానాలే అమలు కాలేదని ఆయన పేర్కొన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ మోసగాళ్లేనని షబ్బీర్‌ అలీ ధ్వజమెత్తారు. పాత బస్తి మెట్రో ఎక్కడా? అని  ప్రశ్నించారు. అంతేగాక మూసీ ప్రక్షాళన అన్నారు.. చేశారా అన్నారు.  కృష్ణ జలాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చింది కాంగ్రెస్‌ అని షబ్బీర్‌ అలీ వ్యాఖ్యానించారు. 

చదవండి: డిసెంబర్‌ నుంచి నీటి బిల్లులు రద్దు: కేసీఆర్‌

పిచ్చోడిలా ప్రవర్తిస్తున్న రఘునందన్‌
వైఎస్‌ఆర్‌ను విమర్శించే స్థాయి రఘునందన్‌కు లేదని షబ్బీర్‌ అలీ అన్నారు. ఒక్కసారి గెలవగానే రఘునందన్‌ పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రఘునందన్‌ గురించి మాట్లాడటం అనవసరమని పేర్కొన్నారు. (చదవండి: ఎంఐఎంతో మాకు ఏం సంబంధం?)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా