మమత కోసం రంగంలోకి శరద్‌ పవార్‌

25 Mar, 2021 13:37 IST|Sakshi

ముంబై: శత్రువుకు శత్రువు మిత్రుడన్న నానుడిని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ మరోసారి రుజువు చేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మీద ఎప్పుడూ విమర్శలు ఎక్కుపెట్టే శరద్‌ పవార్‌ ఇప్పుడు ఏకంగా మమతా బెనర్జీకి సపోర్ట్‌ చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. వచ్చేవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశమవడంతో పాటు భారీ ర్యాలీకి సైతం ప్లాన్‌ చేస్తున్నారు. పవార్‌ బెంగాల్‌ టూర్‌ కోసం మూడు రోజుల పర్యాటన ఖరారైనట్లు ఎన్‌సీపీ అధికార ప్రతినిధి మహేశ్‌ తపసే వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు.

కాగా త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం అస్సాంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఇదివరకే జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఎలాగైనా మమతను గద్దె దింపి రాష్ట్రంలో పార్టీ జెండా ఎగరేయాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మిథున్‌ చక్రవర్తి, గౌతమ్‌ గంభీర్‌తో రోడ్‌షో కూడా చేయించనుంది. 

చదవండి: అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయరు: శరద్‌ పవార్‌

వాళ్లే ‘పరాయి శక్తులు’!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు