ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్‌

22 Sep, 2022 10:07 IST|Sakshi

ముంబై: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఒక కూటమిని ఏర్పాటు చేస్తాయని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ బుధవారం చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌ పార్టీతో తనకున్న విభేదాలను పక్కన పెట్టి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకి కూడా అభ్యంతరాలు లేవన్నారు.

విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం
విపక్ష నేతలను అరెస్ట్‌చేయడం, కేసులు పెట్టించడంలోనే మోదీ సర్కార్‌ బిజీగా ఉందని పవార్‌ విమర్శించారు. ‘‘కేంద్ర ప్రాయోజిక ప్రధాన పథకం ఇదేనేమో. పాత్రా చాల్‌ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. నా పాత్ర లేదని తేలితే నాపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారు’’ అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: అందరూ కోరితే రెడీ.. అధ్యక్ష పదవికి పోటీపై గెహ్లాట్‌ వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు