బీజేపీపై సేన ఫైర్‌

28 Sep, 2020 17:10 IST|Sakshi

ముంబై : ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) బయటకు వచ్చిన క్రమంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిపై శివసేన విమర్శలతో విరుచుకుపడింది. ఎన్డీయే కూటమి నుంచి రెండు సింహాలు ఎస్‌ఏడీ, శివసేన తెగతెంపులు చేసుకున్నాయని, ఇక ఆ కూటమిలో ఇప్పుడు ఉన్నది ఎవరని శివసేన ప్రశ్నించింది. అకాలీదళ్‌ను కూటమి నుంచి వెళ్లకుండా నిరోధించేందుకు ఎన్డీయే ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యపరిచిందని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన రాసుకొచ్చింది. పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం ఎస్‌ఏడీ శనివారం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తూ రైతుల ఉత్పత్తుల కొనుగోలుపై చట్టపరమైన భరోసా ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించడంతో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగామని అకాలీదళ్‌ స్పష్టం చేసింది. బాదల్‌లు ఎన్డీయేను వీడుతున్న క్రమంలో వారిని నిలువరించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు..గతంలో శివసేన సైతం ఎన్డీయేను వీడింది..ఈ రెండు పార్టీల నిష్క్రమరణ తర్వాత ఎన్డీయే దగ్గర ఎవరు మిగిలారని శివసేన ప్రశ్నించింది. ఎన్డీయేతో ఇప్పటికీ ఉంటున్న పార్టీలు అసలు హిందుత్వ కోసం కట్టుబడ్డాయా అని శివసేన ప్రశ్నించింది. చదవండి : ముంబై నుంచి పార్శిల్‌ చేస్తాం: రౌత్‌

మరిన్ని వార్తలు