‘స్వార్థపూరిత పార్టీతో ఎందుకు ప్రయత్నిస్తున్నారు’

29 Jul, 2020 17:59 IST|Sakshi

పూణే: మహారాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.  కాంగ్రెస్‌, ఎన్‌సీపీ పార్టీలతో శివసేన వైదొలిగితే తిరిగి శివసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధమని ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ తెలిపారు. కాగా బీజేపీ వ్యాఖ్యలకు శివసేన అధికార పత్రిక సామ్మాలో శివసేన నాయకులు గట్టిగా కౌంటరిచ్చారు. ఇటీవల 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకులు శివసేనను స్వార్థ, మోసపూరిత పార్టీ అంటూ దూషించారని శివసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. మీరు తీవ్రంగా దూషించిన శివసేన పార్టీతో పొత్తుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ శివసేన నాయకులు బీజేపీపై మండిపడుతున్నారు.

గతంలో శివసేన, బీజేపీ పరస్పర సహకారంతో 2014అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్తంగా అధికారాన్ని చేపట్టారు. కానీ , 2019ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరు పార్టీలకు విబేధాలు వచ్చాయి. తమ ప్రభుత్వ సుస్థిరతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే స్పందిస్తూ.. తమ ప్రభుత్వం పూర్తి పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటుందని అన్నారు. ఆయన ఓ ఉదాహరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం మూడు చక్రాల్లాంటిదని, పేద ప్రజలకు వాహనాం లాగా పనిచేస్తుందని అన్నారు. కాగా అద్భుతంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఎందుకంత కడుపుమంటని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు