కేంద్రమంత్రికి శివసేన సంజయ్‌ రౌత్‌ వార్నింగ్‌.. మేము మీకు ‘బాప్‌’ అంటూ..

19 Feb, 2022 19:02 IST|Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అధికార శివసేన, బీజేపీ నేతల మధ్య మాటల యుద్థం నడుస్తోంది. కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే వ్యాఖ‍్యలకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కౌంటర్‌ ఇచ్చారు. 

అంతకు ముందకు రాణే శుక్రవారం మాట్లాడుతూ.. థాక్రే కుటుంబం, శివసేన జాతకం తన వద్ద ఉందని ఎవరినీ విడిచిపెట్టమంటూ వ్యాఖ‍్యలు చేశారు. సీఎం ఉద్దవ్‌ థాక్రే నివాసం ‘మాతోశ్రీ’లో నలుగురు వ్యక్తుల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 

ఈ నేపథ్యంలో శనివారం సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులను తాము లెక్కచేయమని, రాణే జాతకం కూడా తన వద్ద ఉందంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే మీరు కేంద్ర మంత్రి కావచ్చు.. కానీ ఇది మహారాష్ట‍్ర.. మేము మీకు ‘బాప్‌’ ఇది మర్చిపోవద్దంటూ కామెంట్స్‌ చేశారు. బీజేపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. తాము నిజంగా కుంభకోణాలకు పాల్పడితే వాటికి సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపీ సోమయ్యకు సోమయ్యకు సవాల్‌ విసిరారు.

ఈ సందర్భంగానే తాము కూడా సోమయ్యకు సంబంధించిన కుంభకోణాలను బయటపెడతామంటూ కీలక వ్యాఖ‍్యలు చేశారు. సోమయ్య పోవాయ్‌లోని పెరూ బాగ్‌లో మురికివాడల పునరావాస ప్రాజెక్ట్ ద్వారా సోమయ్య రూ. 300 కోట్లకు పైగా దోపిడీ చేశారని రౌత్ ఆరోపించారు. అలాగే, పాల్ఘార్‌లో రూ. 260 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ విషయంలో కుంభకోణాన్ని బయటపెడతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న క్రిమినల్‌ సిండికేట్‌ను అంతం చేస్తామంటూ సంజయ్‌ రౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు