భూమా అఖిలప్రియకు మరో ఎదురుదెబ్బ

5 Apr, 2021 11:40 IST|Sakshi
రామగురివిరెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్సీ గంగుల

టీడీపీని వీడిన చాగలమర్రి మాజీ జెడ్పీటీసీ, చిన్నవంగలి సర్పంచ్‌

గంగుల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక  

ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా): నియోజకవర్గంలో మాజీ మంత్రి  అఖిలప్రియకు రాజకీయంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా భూమా వర్గంలో ఉంటూ చాగలమర్రి మండలంలో బాసటగా నిలుస్తూ వచ్చిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామగురివిరెడ్డితో పాటు చిన్నవంగలి పంచాయతీ సర్పంచ్‌ సయ్యద్‌వలి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరితో పాటు వెంకటరెడ్డి, ప్రతాప్‌రెడ్డి,   బికారిసాహెబ్, రాజు, డల్లె షరీఫ్, పీరాం సాహెబ్, చిన్న ఇమాంసా, అల్లాబకాష్‌, పద్మకుమార్‌రెడ్డి తదితర భూమా వర్గం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరడం గమనార్హం. వీరిని ఆదివారం ఆళ్లగడ్డలోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి సాదరంగా పారీ్టలోకి     ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిన్నవంగలి లక్ష్మీరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, కొండారెడ్డి, చాగలమర్రి మండల నాయకులు     బాబులాల్, కుమార్‌రెడ్డి, రమణ, రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు

భూమా కోట బద్దలు  
భూమా కుటుంబానికి చాగలమర్రి మండలం సుమారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయంగా అండగా ఉంటూ వచ్చింది. వారు ఏ పారీ్టలో ఉన్నా చాగలమర్రి మండల నాయకులు మాత్రం వారి  వెంటే నడుస్తూ ప్రతి ఎన్నికల్లో బాసటగా నిలిచారు. అలాంటి మండలంలో నేడు భూమా వర్గానికి     చెందిన దాదాపు నాయకులందరూ గంగుల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడం విశేషం. ఇప్పటికే పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో భూమా వర్గం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

కనీసం పరిషత్‌ ఎన్నికల్లోనైనా పరువు దక్కించుకోవాలని భావించారు. కానీ పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం, ఇదే తరుణంలో అఖిలప్రియ కూడా పోటీలో నిలిచిన అభ్యర్థులకు అందుబాటులో లేకపోవడం వారిని  అసంతృప్తికి గురి చేసింది. దీంతో  కీలక నేతలు సైతం టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. 

ప్రజాసేవలో పాలుపంచుకుంటా 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పారీ్టలు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ఆయన పాలనా దక్షతకు ఆకర్షితుడినై వైఎస్సార్‌సీపీలో చేరా. ప్రజాసేవలో     నా వంతుగా పాలు పంచుకుంటా.
– రామగురివిరెడ్డి, చాగలమర్రి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు 

అందరికీ సముచిత స్థానం 
దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న అభివృద్ధి,     సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, స్థానికంగా మా నాయకత్వంపై నమ్మకంతో  పార్టీలో చేరుతున్న వారందరికీ సముచిత స్థానం కల్పిస్తాం. అందరినీ సమన్వయం చేసుకుంటూ అవకాశం వచ్చినప్పుడు వారి స్థాయికి తగ్గ పదవులు ఇప్పించేందుకు కృషి చేస్తాం.
–  ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి
చదవండి:
అంతా పబ్లిగ్గానే.. ‘కూన’ ఇలా చేశాడేంటి..!   
కళా వెంకట్రావు ఓ డిక్టేటర్‌.. ఆడియో హల్‌చల్‌

మరిన్ని వార్తలు