గోషామహాల్ టిక్కెట్ కోసం సింగర్ రాహుల్ సప్లిగంజ్ దరఖాస్తు!

25 Aug, 2023 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్‌ వద్ద ఇవాళ కోలాహలం నెలకొంది.  కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవాళ చివరిరోజు కాగా.. దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 

టాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. గోషామహాల్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీంతో రాహుల్‌ రాజకీయ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇక దరఖాస్తుల పరిశీలన తర్వాత.. ఆయా స్థానాలకు అభ్యర్థుల్ని పీసీసీ ఎంపిక చేస్తుంది. ఇప్పటి వరకు 900 దరఖాస్తులు దాటినట్లు తెలుస్తోంది. చివరి రోజు కావడంతో సాయంత్రం వరకు దరఖాస్తుల సంఖ్య వేయి దాటుతుందని గాంధీభవన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యూట్యూబర్‌గా లోకల్‌ సాంగ్స్‌తో పాపులర్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆపై టాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా అలరిస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 50కిపైగా చిత్రాల్లో పాడారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌-3 విజేతగానూ నిలిచారు. రాజమౌళి ట్రిపుల్‌ఆర్‌ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కుగానూ ఆస్కార్‌ దక్కగా.. ఆ సాంగ్‌ సింగర్‌ అయిన రాహుల్‌కు ఆస్కార్‌ ఆ వేదికపైనా పాడి అలరించే అవకాశం దక్కింది కూడా.

మరిన్ని వార్తలు