లోకేష్‌ భయంపై టీడీపీలోనే సెటైర్లు?.. అందుకే మరో వారం ఢిల్లీలో!

24 Sep, 2023 16:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ‘‘లోకేష్‌బాబులో అరెస్ట్‌ చేస్తారనే భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది’. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో నారా చంద్రబాబు నాయుడిని ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకుని అరెస్ట్‌ చేసిన సీఐడీ.. ఈ స్కామ్‌లో తనయుడు లోకేష్‌ పాత్రపైనా ఆధారాలు ఉన్నాయని ప్రకటించింది. ఇప్పుడు సీఐడీ ఇంటరాగేషన్‌లోనూ చం‍ద్రబాబు లోకేష్‌ పేరు చెప్పొచ్చు!. అందుకే.. అరెస్ట్‌ చేస్తారనే భయంతోనే చినబాబు ఢిల్లీని వీడడం లేదు’’ ఇది టీడీపీలో కొందరు సీనియర్‌ నేతలు ఓపెన్‌గానే చర్చించుకుంటున్న విషయం. 

చంద్రబాబు జైలుకు వెళ్లాక.. కోర్టులో వేసిన పలు పిటిషన్లపై విచారణ మొదలవ్వగానే లోకేష్‌ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఒకవైపు పొలిటికల్‌గా చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లే యత్నం చేయడంతో పాటు లీగల్‌గానూ చర్చలు జరిపేందుకే లోకేష్‌ ఢిల్లీ వెళ్లారని టీడీపీ శ్రేణులు తొలుత భావించాయి. కానీ.. వరుస పరిణామాలు వాళ్లకు తత్వం బోధపడేలా చేశౠయి. లోకేష్‌.. అరెస్ట్‌ భయంతోనే ఢిల్లీలో ఉండిపోయారని వాళ్లు కూడా కన్ఫర్మ్‌ చేసుకుంటున్నారు ఇప్పుడు. 

ఒకవైపు తండ్రి వేస్తున్న పిటిషన్లకు ప్రతికూల తీర్పులు దక్కుతున్నాయి. మరోవైపు రాజకీయంగానూ విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ రెండింటిలో దేనికి లోకేష్‌ నుంచి కనీస స్పందన లభించడం లేదు. కేవలం సోషల్‌ మీడియాలో ఏవో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పోస్టులు పెడుతూ నెట్టుకొస్తున్నారు. ఏపీకి వస్తే.. ఎక్కడ తనను అరెస్ట్‌ చేస్తారనే భయంతో ఢిల్లీలో ఉండిపోయారు.ఇప్పటికే లోకేష్‌ స్నేహితుడు కిలారి రాజేష్‌ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో తాను గనుక ఏపీకి వస్తే.. దర్యాప్తు పేరిట తన నుంచి ఎక్కడ నిజాలు రాబడతారనే భయంలో లోకేష్‌ ఉన్నారేమో అని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

లోకేష్‌ తీరుపై టీడీపీ శ్రేణుల అసంతృప్తి
నారా లోకేష్‌ మరొక వారంపాటు ఢిల్లీలోనే ఉండనున్నారన్నది టీడీపీ శ్రేణుల నుంచి అందుతున్న లీకుల సారాంశం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తండ్రి చంద్రబాబు నాయుడిని ఇప్పటికే కస్టడీ విచారణ చేపట్టింది సీఐడీ. ఈ  ఇంటరాగేషన్‌లోనూ చంద్రబాబు తనకు సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పి ఉంటారా? అనే ఆందోళనలోనూ చినబాబు కనిపిస్తోందని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.  

సీఐడీ ఢిల్లీకి పోలేదా?
తండ్రి జైలుకు వెళ్తే.. ఇక్కడే ఉండి పార్టీని నడిపించాల్సిందిపోయి.. కుటుంబ సభ్యులు చెప్పారని ఢిల్లీకి ఆయన వెళ్లడం(పచ్చిగా చెప్పాలంటే పారిపోవడమే!) సరికాదని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఏపీకి తిరిగి వచ్చి పార్టీ సమావేశం నిర్వహించి కేడర్‌లో ధైర్యం నింపాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నా.. రావాలని బలవంతం చేయొద్దని ఆయన వాళ్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీఐడీ అరెస్ట్‌ చేయాలనుకుంటే.. ఢిల్లీకి కూడా వస్తుంది కదా అని కొందరు అంటే.. ‘‘అప్పుడు చూసుకుందాం’’ అని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిచాలదన్నట్లు.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలంటూ చినబాబు పిలుపు ఇవ్వడంపైనా వాళ్లు బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు