పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం

28 Jan, 2021 12:37 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అధిష్టానానికి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లేఖ రాశారు. దీంతో ఆ పార్టీలో ముసలం రాజుకుంది. తనకు తెలియకుండానే పార్టీ మీటింగ్‌లు పెడుతున్నారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం జిల్లా అధ్యక్షుడిగా వేసిన కమిటీని అధిష్టానం ఆమోదించని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: మాజీ కౌన్సిలర్‌ దారుణ హత్య

మరిన్ని వార్తలు