దర్మంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు 

22 Sep, 2020 06:14 IST|Sakshi

సోము వీర్రాజు మండిపాటు 

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధర్మాన్ని నమ్మే వ్యక్తే అయితే ధర్మాత్ముడులాంటి ఎన్టీ రామారావును ఎందుకు దించేశాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఉండే ప్రతిపక్షం వారికి ధర్మం గుర్తుకొచ్చి ట్వీట్లు పెడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే రాష్ట్రంలో 30 గుళ్లను పడగొట్టారని, ఆ దేవుడి విగ్రహాలను చెత్తబుట్టలో పడేశారని.. ఇప్పుడాయన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటూ వీర్రాజు ఎద్దేవా చేశారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..  

► రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది మరణానికి కారణమైన చంద్రబాబుకు ధర్మం గురించి మాట్లాడే హక్కులేదు. ధర్మం బీజేపీ ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం ధర్మబద్ధంగా వెళ్లాలి.  
► శ్రీవారిని దర్శించుకునే సమయంలో అన్యమతస్తులు సంతకం పెట్టాలన్నది బీజేపీ విధానం.  
► దేవుళ్లపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తోంది. ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని పార్టీ నేతలు ఆంజనేయస్వామికి వినతిపత్రాలు అందజేశారు. 
► రైతుల ఆదాయాన్ని 2024 నాటికి రెట్టింపు చేయాలనే మోదీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. 
► సమావేశానంతరం సోము వీర్రాజు విజయవాడలోని మాచవరం ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సోమువీర్రాజు మాట్లాడుతూ రాజధానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా