‘అమిత్‌షాపై రాళ్లదాడి’ టీడీపీ కక్ష సాధింపు కాదా?: సోము

17 Mar, 2021 04:18 IST|Sakshi

సాక్షి, అమరవతి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేసినప్పుడుగానీ, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో నల్ల జెండాలు చూపి నిరసన తెలిపినప్పడుగానీ చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు సీఐడీ నోటీసుల జారీపై విలేకరులు సోము వీర్రాజు వద్ద ప్రస్తావించినప్పుడు ‘నేను స్పందించదలుచుకోలేదు’ అంటూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఆ శూన్యత భర్తీ చేసేలా బీజేపీ–జనసేన కూటమికి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు సోము వీర్రాజు తెలిపారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు