చంద్రబాబు వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కౌంటర్‌

8 May, 2022 14:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు చేసే త్యాగాలకు బీజేపీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. కుటుంబ, అవినీతి పార్టీల కోసం బీజేపీ త్యాగం చెయ్యదన్నారు. బీజేపీ ఇప్పటికే చాలా త్యాగాలు చేసింది. 2024లో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. జూన్‌ మొదటి వారంలో విజయవాడ, రాజమండ్రిలలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని సోము వీర్రాజు పేర్కొన్నారు. 

చదవండి: (ఎల్లో చానెల్‌లో మీటింగ్‌లు.. చాటింగ్‌లు)

మరిన్ని వార్తలు