అమరావతిలో ఏం అభివృద్ధి చేశారు?

20 Sep, 2020 04:36 IST|Sakshi
ఎయిమ్స్‌ భవనాలను పరిశీలిస్తున్న సోము వీర్రాజు తదితరులు

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజం

సాక్షి, అమరావతి/మంగళగిరి: అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రూ.7,200 కోట్లు ఖర్చు చేసినా ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేకపోయారని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న ఆలిండియా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఆస్పత్రి భవనాలను శనివారం ఆయన పరిశీలించారు. సూపరింటెండెంట్‌ రాకేష్‌కక్కర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వీర్రాజు మీడియాతో ఏమన్నారంటే.. 

► అమరావతిని జపాన్, చైనా సింగపూర్‌లా చేస్తానంటూ కబుర్లు చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారు. రాజధానిలో రైతులకు ఇవ్వాల్సిన 64 వేల ప్లాట్లను గత ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పనిచేయాలి. 
► ఇప్పటి ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది.. అయితే రాజధాని ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. 
► రూ.1800 కోట్లతో 8,000 మంది రోగులకు చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎయిమ్స్‌.. రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. 
► తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌(ఎన్‌ఐడీ) భవనాలను పరీక్షించాం. 20 ఎకరాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తే మొత్తం పూర్తవుతుంది. 

మరిన్ని వార్తలు