సోనియా ఆ హామీ ఇచ్చారు.. బీజేపీని గద్దె దించాల్సిందే.. భేటీ అనంతరం నితీశ్, లాలూ

25 Sep, 2022 21:06 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఈ భేటీ జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐక్యంగా వెళ్లాలని నితీశ్, లాలూ సోనియాను కోరినట్లు తెలుస్తోంది.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లాలూ యాదవ్.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత 2024 ఎన్నికలపై చర్చిస్తానని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. బీజేపీని ఈసారి గద్దెదించాలని, అందుకే నితీశ్‌తో కలిసి సోనియాను కలిసినట్లు పేర్కొన్నారు.

దేశ పురోగతి కోసం విపక్షాలన్ని ఐక్యంగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని నితీశ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఈ విషయం మాట్లాడదామని సోనియా చెప్పారని వెల్లడించారు. గత నెలలో ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోని ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాఘట్‌బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్. ఆ తర్వాత ఆయన సోనియాతో భేటీ కావడం ఇదే తొలిసారి.
చదవండి: రాజస్థాన్ సీఎం పదవికి అశోక్ గహ్లోత్ రాజీనామా!

మరిన్ని వార్తలు