Sonu Sood: చన్నీకి మరొక్కసారి అవకాశం ఇ‍వ్వాలి!!

24 Jan, 2022 19:14 IST|Sakshi

Punjab Assembly Election 2022: పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీకి సుదీర్ఘకాలం పదవిలో ఉండి సేవలందించే అవకాశం లభింనందున అతనికి మరొక్క అవశాశం ఇవ్వాలని బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అన్నారు. చన్నీ ముఖ్యమంత్రిగా చాలా తక్కువ సమయమే పని చేసినప్పటికీ చాలా ప్రశంసించదగ్గ పనులు చేశారని చెప్పారు. అంతేకాదు పంజాబ్‌ రాష్ట కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంచి నిజాయితీ పరుడు, హృదయ పూర్వకంగా మాట్లాడతారని  అ‍న్నారు. కాంగ్రెస్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని, పైగా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందన్న విషయన్ని కూడా నొక్కి చెప్పారు. 

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్‌ని తాను చాలా ఏళ్ల క్రితం ఒక కళాకారుడిగా మాత్రమే కలిశానని చెప్పారు. ఆయన రాజకీయనాయకుడిగా ఎలా ఉంటారనే విషయం గురించి తనకు తెలియదని సోనూ సూద్‌ తెలిపారు. సోనూ సూద్‌ సోదరి 38 ఏళ్ల మాళవిక సూద్ సచార్ కాంగ్రెస్ అభ్యర్థిగా తమ పూర్వీకుల ఊరు మోగా నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తన సోదరితో కలిసి ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, చాలా కాలంగా సామాజిక సేవలో పాల్గొంటున్న తన సోదరికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని సూద్ నొక్కి చెప్పారు. మొగాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ధర్మశాలలు మా కుటుంబమే నిర్మించిందని ఈ సందర్భంగా చెప్పారు.

పైగా వ్యవస్థలో భాగమైతే చాలా పనులు జరుగుతాయని మాళవికను ప్రజలే రాజకీయాల్లోకి తీసుకొచ్చారని సూద్ అన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్‌లోని మోగా నియోజకవర్గంలో మంచి పనులు చేయడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మారిందన్నారు. అంతేకాదు తమ మానిఫెస్టోని అమలు చేయగల పార్టీగా కాంగ్రెస్‌ని విశ్వస్తున్నాని, అందువల్ల తమ సోదరి కాంగ్రెస్‌లో చేరడం మంచిదని భావించానని చెప్పుకొచ్చారు. పైగా తనకు వివిధ పార్టీ నుంచి ఆఫర్లు వచ్చాయని కూడా చెప్పారు. అయితే తాను వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వస్తానని, కాకపోతే తనవద్ద తగినంత పెద్ద టీమ్‌ లేదని అన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం జరిగిన ఆదాయపు పన్ను శాఖ రైడ్‌ విషయం కూడా సెటిల్‌ అయ్యిందని సోనూ సూద్‌ చెప్పారు.

(చదవండి: పాటియాలా నుంచి అమరీందర్‌.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల)

మరిన్ని వార్తలు