ఆరోపణలపై ప్రమాణం చేసే దమ్ముందా?: అనిల్‌ కుమార్‌

17 May, 2022 10:22 IST|Sakshi
స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌  

సాక్షి, నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): రాజకీయాల్లో తాను రూ.కోట్లు సంపాదించానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ నేత ఏ దేవుడి దగ్గరైనా ప్రమాణం చేసే దమ్ము ఉందా అని నగర ఎమ్మెల్యే పీ అనిల్‌కుమార్‌యాదవ్‌ సవాల్‌ విసిరారు. 16వ డివిజన్‌ చిల్డ్రన్స్‌పార్కు, గుర్రాలమడుగు సంఘం ప్రాంతాల్లో సోమవారం ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికుల  సమస్యలను అడిగి తెలుసుకుని, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వేపల్లి కాలువ గట్టుపై నివశిస్తున్న ప్రజలకు తాను మాటిచ్చినట్లే అదే స్థలాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రీటైనింగ్‌ వాల్‌ పూర్తయితే వందేళ్ల పాటు ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చన్నారు. సర్వేపల్లి కాలువ రీటైనింగ్‌ వాల్‌ నిర్మించిన తర్వాత 20 అడుగుల స్థలం వదిలి పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్చి 22న నోఅబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిందన్నారు. గుర్రాల మడుగు సంఘం, సీఆర్‌పీ డొంక, ఉడ్‌హౌస్‌ సంఘంతో పాటు కాలువ గట్లపై ఉన్న ప్రతిఒక్కరికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.  

చదవండి: (సీమసిగలో మెగా పవర్‌ ప్రాజెక్ట్‌.. సీఎం జగన్‌ చేతులమీదుగా శంకుస్థాపన)

బుర్ర లేదు..బుద్ధి లేదు  
ఆంధ్రా పప్పు నారా లోకేష్, నెల్లూరు టీడీపీ సీనియర్‌ సిటిజన్‌కు బుర్రలేదు..బుద్ధి లేదని నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. తాను హైవేలో రూ.50 కోట్లతో లేఅవుట్లు వేశానని, తనకు కిన్నెర ప్రసాద్‌ బినామీ అని ఆంధ్రా పప్పు లోకేష్‌ ఆరోపణలు చేశాడని, గతంలో టీడీపీ కార్పొరేటర్‌గా, కౌన్సిలర్‌గా ఉన్న కిన్నెర ప్రసాద్‌ వేసిన లేఅవుట్లకు అప్పటి మంత్రి నారాయణ, టీడీపీ సీనియర్‌ సిటిజన్‌ బినామీలుగా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో నీతి, నిజాయితీగా లేఅవుట్లు వేశామని చెప్పే ధైర్యం, దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. 2020లో కిన్నెర్‌ ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరాడని, ఆయన కుమారుడికి తాను కార్పొరేటర్‌ సీటు ఇస్తే..టీడీపీకి చెందిన ప్రముఖ నాయకుడు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థికి ఎన్నికల్లో ఫండ్‌ ఇచ్చాడని నిరూపిస్తే అతన్ని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసే దమ్ముందా అని సవాల్‌ విసిరారు.

గతంలో నుడా చైర్మన్‌గా ఉన్న టీడీపీ సీనియర్‌ సిటిజన్‌ హయాంలో అప్రూవల్‌ లేకుండా లేఅవుట్లు ఎన్ని వేశారో తెలియదాని ప్రశ్నించారు. కొందరు తాను రూ.3 వేల కోట్లు, రూ.2వేల కోట్లు, రూ.500 కోట్లు  సంపాదించానని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి తాను పొగొట్టుకున్న దాంట్లో సగం సంపాదించి ఉన్నా, ఆస్తుల రూపంలో కానీ, కుటుంబ సభ్యుల పేరుతో కానీ, బినామీ పేర్లపై  సంపాదించి ఉంటే రుజువు చేయాలని సవాల్‌ విసిరారు.  ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్‌ వేనాటి శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు  ఉన్నారు.

మరిన్ని వార్తలు