సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..

27 Sep, 2023 16:38 IST|Sakshi

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

దర్యాప్తును అడ్డుకోలేమని తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

అక్టోబర్ 3 తర్వాతే సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

లూథ్రా వాదనలకు సీఐడీ కౌంటర్‌

చంద్రబాబు కేసు నుంచి తప్పుకున్న జస్టిస్‌ ఎస్‌వీఎస్‌ భట్టి పూర్తి

సాక్షి, ఢిల్లీ: స్కిల్‌ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌పై వాదనలను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఏదో ఒక బెంచ్‌ ఈ పిటిషన్‌పై విచారిస్తుందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. 

వాడీ-వేడి వాదనలు..
కాగా, చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఆయన తరఫు లాయర్‌ సిద్ధార్థ్ లూథ్రా.. క్వాష్‌ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని సీజేను కోరారు. ఈ సమయంలో క్వాష్‌ పిటిషన్‌ను అనుమతించవద్దని సీఐడీ లాయర్లు సీజేను కోరారు. ఈ కేసులో లోతైన విచారణ జరగాలని సీఐడీ తరఫున రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. చంద్రబాబు లాయర్‌ లాథ్రా వాదనలు వినిపిస్తూ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారించకుండా అడ్డుకోవాలని కోరారు.  ఈ సందర్బంగా సీజేఐ.. ఏసీబీ కోర్టు విచారణ, పోలీసు కస్టడీ విచారణను తాము అడ్డుకోలేమన్నారు. ఈ పిటిషన్‌పై ఏదో ఒక బెంచ్‌ మంగళవారం విచారిస్తుందని స్పష్టం చేశారు. 

అంతకుముందు.. చంద్రబాబు సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు..
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ :  మీకు ఏం కావాలి?
సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ :  చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి
సిద్ధార్థ్ లూథ్రా : FIRలో పేరు లేకుండా అరెస్ట్ చేశారు
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం
సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ :  ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం.
సిద్ధార్థ్ లూథ్రా : కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును  అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం

సుప్రీంకోర్టులో CID వాదనలు
► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు
► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి
► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు
► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు
► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు
► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది
► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి
► 17A చట్టం సవరణ కంటే ముందే నేరం జరిగింది
► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి
► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్

"నాట్‌ బిఫోర్‌ మీ" ఎందుకంటే..
చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాగానే.. న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.

► జస్టిస్‌ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి
► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్‌ భట్టి
► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్‌ భట్టి
► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్‌ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్‌ భట్టి
► జస్టిస్‌ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్‌ ఖన్నా.


చంద్రబాబు పిటిషన్‌ వాయిదా
► చంద్రబాబు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వాయిదా
► పిటిషన్‌పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్‌ ఖన్నా
జస్టిస్‌ ఖన్నా : మా సహచరుడు జస్టిస్‌ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు
హరీష్‌ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు
జస్టిస్‌ ఖన్నా : వచ్చే వారం చూద్దాం
సిద్ధార్థ లూథ్రా ఒక సారి చీఫ్‌ జస్టిస్‌ దృష్టికి తీసుకెళ్తాను
జస్టిస్‌ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను
హరీష్‌ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు
జస్టిస్‌ ఖన్నా : చీఫ్‌ జస్టిస్‌ను కలిసి మరో బెంచ్‌ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు
హరీష్‌ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి
జస్టిస్‌ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం
సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి
జస్టిస్‌ ఖన్నా : సరే, నేను ఆర్డర్‌ పాస్‌ చేస్తున్నాను.
జస్టిస్‌ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్‌ ముందు ఉన్న ఈ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్‌లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్‌ వర్తిస్తుంది".

► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకో‍ర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. 

మరిన్ని వార్తలు