బీజేపీ నుంచి ఔట్‌.. మమత పార్టీలోకి మరో సీనియర్‌ నేత

8 Mar, 2022 15:56 IST|Sakshi

ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన పశ్చిమ బెంగాల్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు జై ప్రకాశ్‌ మజుందార్‌ మంగళవారం తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు కోల్‌కతాలో జరిగిన సమావేశంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. కాగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని అభియోగాలు మోపుతూ ముంజుందార్‌తో పాటు మరో పార్టీ నాయకుడు రితేష్ తివారీని బీజేపీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.

అయితే పార్టీలో సస్పెండ్‌ అయిన, పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలతో ఎంపీ లాకెట్‌ ఛటర్జీ సమావేశమైన మరుసటి రోజే మజుందార్‌ టీఎంసీలో చేరడం విశేషం. 2014లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన. జై ప్రకాష్ మజుందార్ ఇటీవలి వరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందని, పార్టీ కార్యకర్తలను విస్మరించిందని ముజుందార్‌ విమర్శలు గుప్పించారు. 
చదవండి: ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే

ఇదిలా ఉండగా 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినప్పటి నుంచి కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియోతో సహా బీజేపీ నాయకులు టీఎంసీలో చేరారు. ముకుల్, సబ్యసాచి దత్తా, రాజీవ్‌ బెనర్జీ వంటి అనేక మంది టీఎంసీ నుంచి వెళ్లిన వారు కూడా తిరిగి పార్టీలోకి వచ్చారు. 

మరిన్ని వార్తలు