సువేందు అధికారి ఢిల్లీ పర్యటన.. కారణం ఇదేనా!

8 Jun, 2021 13:02 IST|Sakshi

న్యూఢిల్లీ: బెంగాల్‌ బీజేపీ నాయకుడు సువేందు అధికారి మంగళవారం ఉదయం హోం మంత్రి అమిత్‌ షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. అంతకుముందు నౌకాయాన శాఖ మంత్రి మనసుఖ్ లాల్ మాండవీయను కలిసిన ఆయన అమిత్‌షా నివాసానికి చేరుకున్నారు. అంతేకాకుండా సువేందు ఈ రోజు సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలువనున్నారు. ఇక బుధవారం సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీని నందిగ్రామ్ ఎన్నికల యుద్ధంలో సువేందు ఓడించిన సంగతి తెలిసిందే. బెంగాల్‌లో మమతను ఎదుర్కొవడానికి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సువేందు నాయకత్వమే సరియైందని బీజేపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత సువేందు అధికారి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

(చదవండి: వైరల్‌: పెళ్లి కొడుకు హుషారు చూసి పెళ్లి కూతురు షాక్‌!)

మరిన్ని వార్తలు