‘ఆ ఎంపీలపై చర్యలు తీసుకోండి’

16 Aug, 2021 04:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఏడుగురు కేంద్ర మంత్రుల బృందం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడును కలిసింది. ఆగస్టు 11న రాజ్యసభలో అనుచితంగా ప్రవర్తించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ బృందం కోరింది. వారి చర్యలను అనూహ్యమైనవిగా, హింసాయుతమైనవిగా బృందం వర్ణించింది. వెంకయ్యను కలిసిన బృందంలో పీయూష్‌ గోయల్, ప్రహ్లాద్‌ జోషి, ముఖ్తర్‌ అబ్బాస్‌ నఖ్వి, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్‌ యాదవ్, అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్, మురళీధరన్‌ ఉన్నారు.  శనివారం ఆయన పార్లమెంటుకు వెళ్లి ఘటన ఫుటేజీలను పరిశీలించారు. అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు