టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడే

10 Feb, 2021 03:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడతలో వైఎస్సార్‌సీపీ అభిమానులను గెలిపించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ పాలనను ప్రజలు ఆశీర్వదించారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు అవుతుందన్నారు. టీడీపీకి మిగిలింది నిమ్మగడ్డ, నిమ్మాడ మాత్రమేనని చెప్పారు. ఎన్నికలు పెడితే ఏదో తేల్చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడేం చెబుతారని నిలదీశారు.  

చదవండి: (మళ్లీ అదే తీర్పు.. 2,319 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ..)

మరిన్ని వార్తలు