రేపే పోలింగ్‌ : భారీ నగదు, నగలు పట్టివేత 

5 Apr, 2021 14:55 IST|Sakshi

తమిళనాట సింగిల్-ఫేజ్‌లో అసెంబ్లీ ఎన్నికలు

 ముగిసిన ప్రచార పర్వం,  రేపే పోలింగ్‌

 మొత్తం రూ.428కోట్ల నగలు, నగదు స్వాధీనం

సాక్షి, చెన్నై:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం  428 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.  స్వాధీనం చేసుకున్న వాటిలో  225.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా, బంగారంతో సహా విలువైన లోహాలు  176.11 కోట్లు ఉన్నట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మద్యం కూడా పట్టుబడింది.

గత 24 గంటలలో  కరూర్, కోయంబత్తూర్, తిరుప్పూర్ , చెన్నైలు  భారీ దాడులు  నిర్వహించినట్టు ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా ఈ దాడులు జరిగాయన్నారు.  ఇందులో కరూర్ అగ్రస్థానంలో ఉండగా,  కోయంబత్తూర్, తిరుప్పూర్,  చెన్నై తరువాతి స్థానాల్లో నిలిచాయి. తాజాగా రాణిపేట జిల్లాలో రూ. 91.56 లక్షలు, చెన్నైలోని థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గంలో 1.23 కోట్ల రూపాయలు, సేలం వీరపాండి వద్ద 1.15 కోట్ల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కాగా  గత నెలలో, ఆదాయపు పన్ను శాఖ  16 కోట్లకు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకుంది.అలాగే ఎన్నికల నిఘాలో భాగంగా రాష్ట్రంలో పలు సంస్థలపై దాడుల తరువాత సుమారు రూ. 80 కోట్ల బ్లాక్‌ మనీని గుర్తించింది. కాగా  234 నియోజకవర్గాల్లో  మంగళవారం పోలింగ్‌ షురూ కానుంది. తమిళనాట సింగిల్-ఫేజ్‌లో జరగనున్న  అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే  ప్రచార పర్వం ముగిసి నసంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు