తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: దారుణంగా కమల్‌ పార్టీ పరిస్థితి

2 May, 2021 16:42 IST|Sakshi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ సునామి సృష్టిస్తోంది. అధికార అన్నాడీఎంకే రెండంకెలకే పరిమితమైంది. డీఎంకే 125 స్థానాల్లో.. అన్నాడీఎంకే 77 స్థానాల్లో.. కాంగ్రెస్‌ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మిగిలిన పార్టీలేవీ కాంగ్రెస్‌ దరిదాపుల్లో కూడా లేవు. ఇక, లోకనాయకుడు కమల్‌ హాసన్‌ పార్టీ మక్కల్‌ నీది మయ్యమ్‌ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవలం ఒకస్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అది కూడా కమల్‌ హాసన్‌ పోటీ చేస్తున్న కోయంబత్తూర్‌ సౌత్‌లోనే. అక్కడ కూడా పోటాపోటీగా ఉంది. కమల్‌ 15 వేల పైచిలుకు ఓట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎంఎస్‌ జయకుమార్‌ 12 వేల పైచిలుకు ఓట్లు.. మూడో స్థానంలో బీజేపీకి చెందిన వాసంతి శ్రీనివాసన్‌ 11 వేల పైచిలుకు ఓట్లను సొంతం చేసుకున్నారు. దాదాపు రెండు వేలపై చిలుకు ఓట్ల మెజార్టీలో కమల్‌ ఉన్నారు. అయితే ఈ మెజార్టీ అలానే కొనసాగుతుందా లేక, తారుమారు అవుతుందా అన్నది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది.

కాగా, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు సౌత్‌లో ఏఐడీఏంకే తరఫున అమ్మన్‌ కే అర్జున్‌ విజయం సాధించారు. పొత్తుల్లో భాగంగా ఏఐడీఎంకే పార్టీ ఈ స్థానాన్ని మిత్ర పక్షం బీజేపీకి కేటాయించింది. ఇక 2019 జనరల్‌ ఎలక్షన్‌లో ఎంఎన్‌ఎం కోయంబత్తూరు నియోజకవర్గంలో 11 శాతం ఓట్లు సాధించగలిగింది. ఇక్కడ పార్టీకి మద్దతురాలు ఎక్కువ ఉండటం.. ప్రస్తుత ఎన్నికల్లో ఏఐడీఎంకే కాకుండా బీజేపీ కోయంబత్తూరులో బరిలో నిలవడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కమల్‌ ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు