కమల్‌ మేనిఫెస్టో: గృహిణులకు జీతాలు కానీ..

20 Mar, 2021 08:39 IST|Sakshi
మేనిఫెస్టో విడుదల చేసిన కమల్‌ హాసన్‌

నీట్‌కు బదులు సీట్‌ 

గ్రామ ప్రగతికి స్మార్ట్‌ విలేజ్‌ 

ఆర్మీ తరహాలో ప్రజా క్యాంటీన్లు

సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పదేళ్ల ప్రణాళికతో మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ హాసన్‌ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ప్రకటించారు. అధికారంలోకి వస్తే,  నీట్‌ పరీక్షకు బదులుగా రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ సిల బస్‌తో సీట్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామ ప్రగతికి స్మార్ట్‌ విలేజ్‌ పథకం, ఆర్మీ తరహాలో ప్రజా క్యాంటీన్ల ద్వారా అన్ని రకాల వస్తువుల్ని చౌక ధరకే అందించనున్నామని ప్రకటించారు. మక్కల్‌ నీది మయ్యం, ఎస్‌ఎంకే, ఐజేకేలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతల కమల్‌ పోటీలో ఉన్నారు.

ఈ దృష్ట్యా, కోయంబత్తూరు వేదికగా శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను సైతం కమల్‌ విడుదల చేశారు. ఇందులో తమిళనాడు సమగ్రాభివృద్ధి, అప్పు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగు, విద్య, వైద్య పథకాలతో ప్రజాకర్షణ అంశాలను పొందుపరిచారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేంద్రన్, పొన్‌రాజ్‌లతో కలిసి  మేనిఫెస్టోను కమల్‌ ఆవిష్కరించారు. ప్రజల్ని బానిసలుగా, పేదలుగా మార్చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన పార్టీలకు విశ్రాంతి ఇద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.  

మేనిఫెస్టోలో కొన్ని.. 

∙రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ పదేళ్ల ప్రణాళిక  
∙రెండు కోట్ల మందికి ఉద్యోగాలు  
∙అన్ని రంగాల్లోనూ తమిళనాడు అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. రాష్ట్ర ఆర్థిక ప్రగతి రానున్న పదేళ్లలో పది నుంచి 20 శాతం మేరకు వృద్ధి లక్ష్యంగా కార్యాచరణ  
∙వ్యక్తి ఆదాయం సంవత్సరానికి 7 నుంచి పది లక్షల వరకు పెంపు  
∙నదీ జలాల అనుసంధానం, జల అభివృద్ధి, వాటర్‌ మెనేజ్‌మెంట్‌బోర్డు, అందరికీ స్వచ్ఛమైన శుద్ధీకరించిన నీళ్లు 
∙వ్యవసాయ రంగంలో హరిత విప్లవం లక్ష్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, రైతుల హక్కుల పరిరక్షణ  
∙జాలర్లకు జీవనాధారం, భద్రత లక్ష్యంగా చర్యలు  
∙ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు. నీట్‌కు బదులు రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ సిలబస్‌తో సిట్‌ పరీక్ష.  అందరికీ వైద్యం, విద్య, ఉన్నత విద్యకు చర్యలు 
∙గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ స్మార్ట్‌ విలేజ్‌ పథకం  
∙ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయం, అర్హులకు ఉద్యోగాలు, పారిశ్రామిక ప్రగతి, వృద్ధులకు భద్రత, అనాథలకు ఆపన్న హస్తం, రాజకీయ న్యాయం, సమష్టి నాయకత్వంఅభివృద్ధి చెందిన చిన్న దేశాలకు దీటుగా తమిళనాడును తీర్చిదిద్దడం లక్ష్యంగా పథకాలు అమలు. 
∙గృహిణులకు జీతాలు (ఇది ఉచితం కాదు –వారికి వృత్తిపరంగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం) 
∙విద్యుత్, రవాణా సంస్థల బలోపేతం. ఈ సంస్థల్లో ఉద్యోగులకు వాటా.  
∙ప్రజలు చౌక ధరకే అన్ని వస్తువుల్ని కొనుగొలు చేసుకునే రీతిలో ఆర్మీ క్యాంటీన్ల తరహాలో మక్కల్‌  క్యాంటీన్ల ఏర్పాటును మేనిఫెస్టోలో పొందుపరిచారు. 

సీపీఎం, టీఎంసీలు కూడా.. 
డీఎంకే కూటమిలోని సీపీఎం, అన్నాడీఎంకే కూటమిలోని తమాకా కూడా మేనిఫెస్టోలను శుక్రవారం ప్రకటించారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి బాలకృష్ణన్, సీనియర్‌ నేత టీకే రంగరాజన్‌ ఆవిష్కరించిన మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యనిషేధం, ఖాళీగా ఉన్న 4.5 లక్షల ఉద్యోగాల భర్తీ, శరణార్థులుగా ఉన్న  శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం అంశాలను ఇందులో పొందుపరిచారు. టీఎంసీ నేత జీకే వాసన్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రభుత్వ పాఠశాలల ప్రగతి, ఫీజుల తగ్గింపు, వైద్య, వ్యవసాయ రంగాల బలోపేతం, ఆలయాలన్నీ భక్తులకు అప్పగింత,
 

మరిన్ని వార్తలు