అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే!

18 Mar, 2021 19:05 IST|Sakshi

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లను బీజేపీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక వీరితో పాటు స్థానిక బీజేపీ నేత, నటి గౌతమిని కూడా స్టార్‌ క్యాంపెయినర్‌గా అధిష్టానం ప్రకటించింది. కాగా అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కాషాయ పార్టీకి 20 సీట్లు దక్కాయి.  

ఈ నేపథ్యంలో రాజపాళయం సీటు కమలనాథుల చేజారడంతో, ఆ స్థానం నుంచి పోటీపడదామనుకున్న గౌతమికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా ఆమె సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. కాగా ఏప్రిల్‌ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుండగా, మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.

కమల్‌ వర్సెస్‌ గౌతమి!
మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హాసన్‌, తమ పార్టీ  154 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ దూకుడు పెంచారు. కాగా కమల్‌ హాసన్‌- గౌతమి పదమూడేళ్ల పాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. విభేదాలు తలెత్తిన కారణంగా 2016లో వీరు విడిపోయారు. ఇక గౌతమిని స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో, ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కాగా ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కమల్‌కు శరత్‌ కుమార్‌, రాధిక వంటి ప్రముఖుల మద్దతు ఉంది. 

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు వీరే
1. నరేంద్ర మోదీ
2. జేపీ నడ్డా
3. రాజ్‌నాథ్‌ సింగ్‌
4. అమిత్‌ షా
5. నితిన్‌ గడ్కరీ
6.నిర్మలా సీతారామన్‌
7. స్మృతి ఇరానీ
8. ఎస్‌ జైశంకర్‌
9. కిషన్‌రెడ్డి
10. జనరల్‌ వీకే సింగ్‌(రిటైర్డు)
11. యోగి ఆదిత్యనాథ్‌
12. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
13. సీటీ రవి
14. పురందేశ్వరి
15. పి సుధాకర్‌ రెడ్డి
16. తేజస్వి సూర్య
17. ఎల్‌ గణేషన్‌
18. వీపీ దురైస్వామి
19.కేటీ రాఘవన్‌
20. శశికళ పుష్ప
21. గౌతమి తాడిమల్ల
22. రాధారవి
23. కేపీ రామలింగం
24. గాయత్రీ దేవి
25. రాజ్‌కుమార్‌ గణేషన్‌
26. విజయశాంతి
27. సెంథిల్‌
28. వెల్లూర్‌ ఇబ్రహీం
29. ప్రొఫెసర్‌ రామ శ్రీనివాసన్‌
30. ప్రొఫెసర్‌ కనగ సబాపతి
చదవండి: కమల్‌ సీఎం కావడం ఖాయం..

మరిన్ని వార్తలు