తమిళనాడు ఎన్నికలు: గంటల వ్యవధిలో 428 కోట్లు సీజ్

5 Apr, 2021 18:44 IST|Sakshi

చెన్నై: మరికొద్ది గంటల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌(ఎస్‌ఈసీ) 428 కోట్లు విలువ చేసే బంగారం, నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను సీజ్‌ చేసింది. ఓటర్లకు పంచడానికి సిద్ధంగా ఉంచిన రూ. 225.5 కోట్ల నగదు, రూ.200 కోట్లకుపైగా విలువైన బంగారం, మద్యం, గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికలకు ముందు 72 గంటలు అత్యంత కీలకమని, ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని ఈసీ వివరించింది.

కాగా, గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లోని అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా అక్రమ సొత్తు బయటపడిన నగరాల్లో కరూర్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో కోయంబత్తూర్, తిరుప్పూర్, చెన్నై నగరాలు ఉన్నాయని ఈసీ పేర్కొంది.
చదవండి: బాక్సర్‌ కావాల్సిన కుర్రాడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు..

మరిన్ని వార్తలు