చిదంబరం తీరుపై రాహుల్‌ గాంధీ అసంతృప్తి?

31 Mar, 2023 13:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌ సీనియర్‌నేత పి. చిదంబరం తీరుపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. కొంత కాలంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో గత వారం రాహుల్‌ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పు ఇవ్వడం, ఎంపీ పదవి వ్యవహారంలో అనర్హత వేటుకు గురవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంపై కూడా చిదంబరం స్పందించక పోవడం రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది.

సీనియర్‌ నేతగా, జాతీయ రాజకీయ అంశాలపై మంచి అవగాహన కలిగిన చిదంబరం మౌనంగా ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో నిరసనలు సాగుతున్న సమయంలోనూ.. చిదంబరం ఏ ఒక్క చోటా కనిపించక పోవడాన్ని ఇక్కడి గ్రూపు నేతలు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో చిదంబరం వ్యవహారాన్ని రాహుల్‌ తీవ్రంగా పరిగణించారని, ఆయన పనితీరుపై అసంతృప్తితో ఉన్నారనే వాదనలు రాష్ట్ర కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు