ఎం.కే స్టాలిన్‌పై ఎమ్మెల్యే పొగడ్తల వర్షం... వార్నింగ్‌ ఇచ్చిన సీఎం

29 Aug, 2021 17:05 IST|Sakshi

చెన్నై: మనం చేసే పనులను బట్టి పొగడ్తలు వస్తుంటాయి. కానీ, వాటికి కూడా సమయం సందర్భం అనేవి ఉండాలి. అసెంబ్లీ సెషన్‌ జరుగుతుండగా సీఎంను ప్రసన్నం చేసుకోవడానికి కొందరు నేతలు పొగడ్తలతో ముంచెత్తడం మనం ఎన్నోసార్లు లైవ్‌లో చూసి ఉంటాం. అయితే, తమిళనాడు సీఎం స్టాలిన్‌ పోగడ్తల కన్నా పనే ముఖ్యమంటున్నారు. తాజాగా సభా సమయంలో తనను ప్రశంసిస్తున్న డీఎంకే పార్టీ నేతలకు ఆయన సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చారు.

శనివారం తమిళనాడు అసెంబీలో.. సీఎం స్టాలిన్, దివంగత అగ్రనేతలు అన్నాదురై, కరుణానిధిని కీర్తిస్తూ కడలూరు నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అయ్యప్పన్‌ సుదీర్ఘంగా ప్రసంగించారు. సుమారు ఐదు నిమిషాలకు పైగా స్టాలిన్‌ను పొగిడారు. ఇందుకు సీఎం స్టాలిన్‌ అభ్యంతరం పలుకుతూ.. నా గురించి పొగడ్తల ప్రసంగాలు వద్దని శుక్రవారమే చెప్పాను, అయినా సభ్యులు మానుకోలేదు, ఎమ్మెల్యేలు అనవసర ప్రసంగాలు మాని, బడ్జెట్‌, సమస్యలపై చర్చించి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అంతేకాదు.. సభా సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.

చదవండి: మేం పిలుపు ఇస్తే తట్టుకోలేరు.. బీజేపీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపాటు 

మరిన్ని వార్తలు