సంతబొమ్మాలి ఘటన, టీడీపీ బాగోతం బట్టబయలు

19 Jan, 2021 19:46 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: రాజకీయ ఉనికి కోసం టీడీపీ అడ్డదారులు తొక్కుతోందన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని శివాలయంలో ఉన్న నంది విగ్రహాన్ని తొలిగిస్తూ అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ తమ్ముళ్లు. తొలగించిన విగ్రహాన్ని సమీపంలోని మూడు రోడ్ల కూడలిలో ఉన్న సిమెంట్‌ దిమ్మెపైకి తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో వారి బండారం బయటపడింది. ఈనెల 14న సంతబొమ్మాళిలోని అతి పురాతన పాళేశ్వర స్వామి ఆలయంలో నంది విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారడంతో గ్రామస్తుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తుండగా విషయం వెలుగు చూసింది.

ఈ విషయంపై విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు వెంకట రంగారావు మాట్లాడుతూ.. సంతబొమ్మాళి మండలం పాళేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ తరలింపు చట్ట విరుద్ధమని, విగ్రహం తరలింపు వెనుక దురుద్దేశం కనిపించిందని పేర్కొన్నారు. ముందురోజు పోలీసులు వివరాలు అడిగినా చెప్పని ఆలయ వర్గాలు.. గుట్టుగా రోడ్డు మధ్యలో విగ్రహాన్ని పెట్టాలని యత్నించారని తెలిపారు. ఈ కేసులో వీఆర్వో 22 మంది పై ఫిర్యాదు చేయగా, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పేర్కొన్నారు. వీరిలో ప్రతిపక్ష రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు నలుగురు ఉన్నారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు